telugu navyamedia
క్రైమ్ వార్తలు

అఘాయిత్యం చేస్తే బెయిల్.. బైటికివచ్చి.. సాక్షాన్ని చంపేసి…

SIT Investigation YS viveka Murder

12 ఏళ్ళ లోపు వారికోసం ప్రభుత్వం పోక్సో చట్టం చేసిన విషయం తెలిసిందే. అయితే అంత కంటే ఎక్కువ వయసు ఉన్నవారిని హింసించవచ్చు అని ఆ చట్టాన్ని అర్ధం చేసుకున్నవారు, ఆ తరహా నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. అంతే కాకుండా, వారిని చట్టం ఎక్కువ కాలం జైలులో పెట్టె అవకాశం లేకుండా, బెయిల్ కూడా ఏర్పాటు చేసింది. దీనితో నేరాలు చేసినా, దర్జాగా సమాజంలో తిరగవచ్చు అనే ధైర్యం వచ్చి, నేరాలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. దీనిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది..దీనికి చక్కటి ఉదాహరణ చూడండి..

అఘాయిత్యం కేసును వెనక్కి తీసుకోలేదని, బాధిత బాలికతో బలవంతంగా విషం తాగించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ట్యూషన్ నుంచి వస్తున్న 17 ఏళ్ల బాధిత బాలికను బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అడ్డగించారు. తమపై పెట్టిన రేప్ కేసును వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకామె నిరాకరించడంతో బలవంతంగా ఆమె నోట్లో విషం పోసి పరారయ్యారు. ఢిల్లీ శివారు డ్వార్కా జిల్లాలోని హస్త్‌సాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజధానిలోనే ఇంతగా జరిగితే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటో?

ఈ ఘటన అనంతరం, సృహ కోల్పోయి రోడ్డుపై పడి ఉన్న బాలికను స్థానికులు సకాలంలో ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కేసును వెనక్కి తీసుకోవాలని, కోర్టులో తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని నిందితులు బెదిరించినట్టు బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొంది. తాను అంగీకరించకపోవడంతో చేతులు పట్టుకుని బలవంతంగా నోట్లో విషం పోసినట్టు తెలిపింది. బాలిక కిడ్నాప్, అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన నిందితులు ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. బైటికి వదలడం ఎందుకు, మళ్ళీ వెతుక్కోవడం ఎందుకో.. దీన్నే అతితెలివి అంటారు.

Related posts