telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బ్యాగులో 5 నెలల బాలుడు… పోలీసులు షాక్

Baby

ఐదు నెలల బాలుడిని అపహరించి లగేజీ బ్యాగులో దుబాయ్ నుంచి కరాచీకి తరలిస్తుండగా దుబాయ్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను భారత ఐపీఏస్ అధికారి దహలివాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 1997 ఐపీఏస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నాడు ‘బేబీ బ్యాగేజడ్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను దహలివాల్ ట్వీట్ చేశారు. అక్రమంగా 5 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి లగేజీ బ్యాగులో తరలిస్తుండగా ఎయిర్ పోర్ట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డాడని, అనుమానంతో బ్యాగును తెరిచి చూసిన అధికారులకు లోపల బాబు కనిపించినట్లు పేర్కొన్నారు. దుబాయ్ నుంచి పాక్‌లోని కరాచీకి బాలుడిని తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారని ఆయన తెలిపారు. అదృష్టవశాత్తు బాబుకు ఏమి కాలేదని, బ్యాగులో సురక్షితంగానే ఉన్నాడని ఈ ఘటనకు సంబంధించిన వీడియోను దహలివాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Related posts