telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పుడుతూనే పాపను వరించిన లక్కు… అందుకే ఆ బేబీకి రైల్వేలో బంపర్ ఆఫర్…!?

Baby-Borm-in-Railway

హ్యూస్టన్ రైల్వే స్టేషన్‌లో పుట్టిన ఓ పాప రైల్వే నుంచి బంపర్ ఆఫర్ పట్టేసింది. రైలులో పుట్టిన ఆ పాపకు పాతికేళ్ల వరకు ఉచిత రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు అక్కడి రైల్వే అధికారు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ మహిళ రైలులోనే పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో రైల్వే అధికారులు ఆ చిన్నారికి 25 ఏళ్ల వరకు ఉచిత రైల్వే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. గాల్వే నుంచి డబ్లిన్ వెళ్లే ఐర్నాడ్ ఏరీన్న్ ఐరిష్ రైలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ట్రైన్ టాయిలెట్‌ నుంచి మహిళ పురిటినొప్పులతో బాధపడుతున్న అరుపులు విన్న రైలులో క్యాటరింగ్ చేసే ఏమ్మా టోట్ అనే మహిళ వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసింది. దాంతో ట్రైన్ డ్రైవర్… ప్రయాణికులలో ఎవరైన వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారు ఉంటే గర్భిణి డెలివరీకి సహకరించేందుకు ముందుకు రావాలని కోరాడు. అయితే, రైల్వే సిబ్బంది సమాచారంతో ఆలన్ డివైన్ అనే వైద్యుడు ఇద్దరు నర్సుల సహయంతో మహిళకు పురుడు పోశారు. అనంతరం చికిత్స కోసం తల్లిబిడ్డ ఇద్దరిని డబ్లిన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపతో పాటు తల్లి కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Related posts