telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

బాబును దించెయ్యడానికి కుట్ర : సూత్రధారి మోదీ పాత్రధారులు కేసీఆర్ , జగన్

chandrababu on modi tour in ap
చంద్ర బాబును మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చిత్తుగా ఓడించాలని, తెలుగుదేశం పార్టీని రాజకీయంగా భూస్థాపితం చెయ్యాలని మహా కుట్ర జరుగుతుందని సోషల్ మీడియా లో వచ్చింది . ఈ వార్త నిజమేనని చంద్ర బాబు ధ్రువీకరించాడు . అటు ఢిల్లీలో నరేంద్ర మోదీ , ఇటు హైద్రాబాద్లో కేసీఆర్ , జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల ప్లాన్స్ చేస్తున్నారని ,రాబోయే ఎన్నికల్లో తనని ఓడించడానికి  ప్రయత్నిస్తున్నారని బాబు చెప్పాడు . 
Chandra Babu,KCR
ఇది నిజమేనని ఇప్పుడు కేటీఆర్  ప్రకటనలు  చుస్తే అర్ధమవుతుంది . గత కొన్నాళ్ల నుంచి కేటీఆర్  చంద్ర బాబును రాజకీయంగా దెబ్బ తీయడానికే ప్రయత్నిస్తున్నాడు . కేసీఆర్ తో బాబును పోల్చుతూ  హీనంగా మాట్లాడుతున్నాడు . దీనివెనుక పెద్ద కుట్రే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు . 
Communist Parties Away Darmaporata Deeksha
నరేంద్ర మోడీ ద్రుష్టి ఇప్పుడు చంద్ర బాబు పై వుంది . తమ రాజకీయ ప్రత్యర్థి రాహుల్ గాంధీతో కలసి ప్రతిపక్ష పార్టీలను ఒక త్రాటిపైకి తీసుకు రావడానికి బాబు ప్రయత్నం చేస్తున్నాడని మోడీ మంది పడుతున్నాడు . చంద్ర బాబును మళ్ళీ అధికారంలో రాకుండా చేయడానికి ఆయన కేసీఆర్, జగన్తో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాడని అంటున్నారు . 
చంద్ర బాబును ఓడించడానికి వెయ్యి  కోట్లు ఖర్చుపెట్టడాని సిద్ధమవుతున్నారని అంటున్నారు . ఇదే విషయాన్ని చంద్ర బాబు నాయుడు కూడా చెప్పాడు . 
YS Jagan Write letter to KCR
ఇప్పుడు కేటీఆర్ చంద్ర బాబును నైతికంగా దెబ్బ తీయాలని, రాజకీయంగా అప్రతిష్ట పాలు చెయ్యాలని చూస్తున్నాడు . 
ఇది కుట్రలో భాగమేనని చంద్ర బాబు నమ్ముతున్నాడు . కేసీఆర్ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నాడు  , ఆయన ఎప్పటికప్పుడు జగన్ మోహన్ రెడ్డితో టచ్ లో వున్నాడని అంటున్నారు . కేసీఆర్ రాజకీయ అవకాశవాది అని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి . ఒకప్పుడు తెలంగాణ ఇస్తే  తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాకు హామీ ఇచ్చాడు .
Chandrababu Not contest MLC Elections
సోనియా గాంధీ కేసీఆర్ ను నమ్మింది . తీరా రాష్ట్రము ఇచ్చిన తరువాత  కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోలేదు . 
కాబట్టి కేసీఆర్ అజెండా ఎలావుంటుందో ఎవరికీ తెలియదు . రాజకీయ అవసరం కోసం ఒకటవుతారు , ఆ అవసరం తీరాక తన స్వార్ధ ప్రయోజనాలే లక్ష్యంగా వెళ్లడం కేసీఆర్ అలవాటు . ఇప్పుడు వారి వారి అవసరాల కోసం  మోడీ, కేసీఆర్ , జగన్ ఒకటి అయ్యారు . ఈ పరిణామం ఆంధ్ర ప్రజలు  గమనిస్తూనే వున్నారు . వారి తీర్పు ఎలా ఉంటుందో చూడాలి 

Related posts