• Home
  • వార్తలు
  • నేనేం తప్పుచేశాను? ఉగ్రవాదుల కంటే కఠిన శిక్ష వేశారు: బాబుమోహన్
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

నేనేం తప్పుచేశాను? ఉగ్రవాదుల కంటే కఠిన శిక్ష వేశారు: బాబుమోహన్

Babu Mohan BJP Fire to KCR

ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన సంగారెడ్డిలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఆందోల్ టికెట్ తనకు కేటాయించకుండా సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని బాబుమోహన్ అన్నారు. స్థానిక అభ్యర్థికే టికెట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్, గతంలో తనకెందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు.కేసీఆర్ ను నా గాడ్ ఫాదర్ అనుకున్నా.. నేనేం తప్పుచేశానో! కేసీఆర్ వేసిన శిక్ష న్యాయమా? ఉగ్రవాదుల కంటే కఠిన శిక్ష వేశారు.

ఇరవై ఐదేళ్ల క్రితమే నేను ఎమ్మెల్యేను. నేను ఇంకా లోకల్ కాదా? నేను తెలంగాణలోనే జన్మించాను. నేను ఎలా చూసినా లోకలే. నాలాంటి వాడికి అన్యాయం చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు’ అని శాపనార్థాలు పెట్టారు. టీఆర్ఎస్‌లో ఏ రాయి ఎటునుంచి వచ్చినా హరీష్‌‌రావుకే తగులుతుందన్నారు. హరీష్‌రావు వల్లే టీఆర్ఎస్ బతికుందని చెప్పుకొచ్చారు. అందోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఓ బ్రోకర్‌ అంటూ బాబుమోహన్ మండిపడ్డారు. బీసీ, దళితులను ఆదరించిన పార్టీ బీజేపీయేనని, దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత తమ పార్టీదేనని అన్నారు.

Related posts

ఆంధ్రావాళ్ల వ్యాపారాలలో కేటీఆర్‌ భాగస్వామి!

madhu

దుబాయ్ చేరిన భారత క్రికెటర్లు.. ఆసియా కప్

nagaraj chanti

మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి… జీహెచ్ఎంసీ కమిషనర్.. ఎందుకంటే

nagaraj chanti

Leave a Comment