telugu navyamedia
andhra political

చంద్రబాబుతో బాబా రాందేవ్ భేటీ!

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో యోగా గురువు బాబా రాందేవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్నరావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేసే ‘మెగా ఫుడ్ పార్క్’ గురించి ముఖ్యమంత్రికి రాందేవ్ వివరించారు. రూ.634 కోట్లతో ఆహార శుద్ధితో పాటు అనుబంధ యూనిట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 
దాదాపు 33,400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. దీంతో ‘మెగా ఫుడ్ పార్క్’కు ప్రభుత్వం 172.84 ఎకరాలు కేటాయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. రసాయనాలు, పురుగు మందులు లేని వ్యవసాయ ఉత్పత్తుల దిశగా కృషి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

Related posts

దూకుడు పెంచిన .. గల్లా జయదేవ్ .. గుంటూరులో పాగా..!

vimala p

జేసి దివాకర్ కళాశాలలో .. అధికారుల తనిఖీలు ..

vimala p

సిద్దు ప్రచారానికి .. దూరం..

vimala p