telugu navyamedia
telugu cinema news

బిగ్ బాస్-3 : జాఫర్, బాబా మాస్టర్ మధ్య వార్

Bigg-Boss-3

బిగ్‌బాస్-3 తొలిరోజు నుంచే హాట్‌హాట్‌గా నడుస్తోంది. వరుసగా నామినేషన్లు, టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలతో నడుస్తుంది బిగ్‌బాస్ సీజన్ 3. మొదటి రోజు నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మొన్న హిమజకి, హేమకి గొడవ జరిగితే నిన్న హేమ, రాహుల్ ఒకరిపై ఒకరు అరుచుకుంటూ పెద్ద గొడవ చేశారు. ఇన్ని గొడవలు జరుగుతున్న ఆ బిగ్ బాస్ షో లో సైలెంట్ గా ఉన్నారు జాఫర్, బాబా మాస్టర్. ఎవరు ఎన్ని గొడవలు పడిన వారికీ అవసరం లేనట్టు, గెలిచినా ఓడినా ఒకటే అన్నట్టు వాళ్ళు పర్ఫర్మ్ చేస్తున్నారు. అలాంటిది ఈరోజు వచ్చిన ప్రోమోలో ఆఖరికి వాళ్ళు కూడా గొడవ పడ్డారు. పాటలతో మొదలు పెట్టి చివరికి గొడవ పడే స్టేజికి వెళ్లారు. బాబా మాస్టర్ స్టెప్పులతో పాటు జాఫర్ కి పాట ఎలా పాడాలో కూడా నేర్పించారు. అలాంటిది ఒకానొక సమయంలో జాఫర్ బాబా మాస్టర్ పై విరుచుకు పడ్డాడు. నన్ను ‘రా’ అంటావ్ ఏంటి అంటూ బాబా మాస్టర్ పైకి వెళ్ళాడు జాఫర్. అయితే జాఫర్ నిజంగా సీరియస్ అయ్యాడా ? లేక అది కూడా ‘డ్రామా’నా అనేది తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే బిగ్ బాస్ షోను చూడాల్సిందే.

Related posts

పద్మభూషణ్ రామానాయుడు కల సాకారం కాలేదు

vimala p

ఈ ముగ్గురు స్టార్ హీరోలతో పని చేయనున్న “కేజీఎఫ్” దర్శకుడు

vimala p

‘అల వైకుంఠపురములో’ ఆల్ టైం రికార్డు…!

vimala p