telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉదయభాను కోసం బాబా మాస్టర్ స్టూడియోల చుట్టూ…!?

Baba-Master

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం తెలుగు సీజ‌న్-3… నాగార్జున హోస్ట్‌గా 15మంది సెల‌బ్రిటీల‌తో జూన్ 21న మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి ఇంట్లోకి ప్ర‌వేశించారు. ఈ షోలో బాబా భాస్కర్ మాస్టర్ ఇంటి సభ్యులుగా వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు భాబా మాస్టర్ ఎన్నో టివి ప్రోగ్రామ్స్ లో కనిపించారు. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై వచ్చే ప్రముఖ డ్యాన్స్ షో “ఢీ”లో బాబా మాస్టర్ తనదైన మార్క్ చాటుకున్నారు. అయితే బాబా భాస్కర్ బిగ్ బాస్ లోకి రాక ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో బాబా మాస్టర్ కు ఉదయభానుకు సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది. యాంకర్ అప్పట్లో ఓ యాంకర్ కోసం మీరు స్టూడియోలు చుట్టూ తిరిగేవారట.. ఎవరా యాంకర్ ? అని అడిగారు.
ఈ విషయంపై స్పందించిన బాబా మాస్టర్ అలాంటిది ఏమీ లేదని..ఈ విషయంలో తనను చాలా మంది అపార్థం చేసుకున్నారని, ఉదయ భాను, తాను కలిసి ఢీ2 షోకి యాంకరింగ్ చేశామని.. దాంతో కొంతమంది లేనిపోనివి అనుకునేవాళ్లని చెప్పారు. కానీ తమ మధ్య అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు. ఉదయ్ భాను డెవిల్ అయితే తాను గాడ్ అని చెప్పారు. అయితే ఢీ-2 షోలో తనకు, ఉదయ్ భానుకు మధ్య జరిగే సరదా గొడవలను తన భార్య మరోలా అర్థం చేసుకునేదని భాస్కర్ అన్నారు. ఈ విషయంపై తన భార్య కూడా తనను ప్రశ్నించిందని, ఎందుకు ఆ అమ్మాయితో ఎక్కువ సన్నిహితంగా ఉంటావని, చేతులు పట్టుకుంటావు. దగ్గరగా ఉంటావని అడిగిందని, అది డ్యాన్స్ షో కాబట్టి ఇద్దరం డ్యాన్స్ చేసేటప్పుడు సాధారణంగా చేతులు పట్టుకునేవాళ్లమని… దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అని ఆమెకు నచ్చజెప్పినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఆయన భార్య మాత్రం ఆ అమ్మాయి కాస్త ఓవర్ చేస్తుంది. చూసేవాళ్లు కూడా అపార్థం చేసుకుంటారు అని హెచ్చరించిందని తెలిపారు.

Related posts