telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మత్తుమందులకు అలవాటు పడ్డ “సరిగమప లిటిల్ చాంప్స్” విజేత…!

Azmath

8 ఏళ్ల క్రితం అజ్మత్ హుస్సేన్ ‘సరిగమప లిటిల్ చాంప్స్’లో విజేతగా నిలిచాడు. తన అద్భుత గాన మాధుర్యంతో అందరినీ మైమరపించాడు. అజ్మత్ హుస్సేన్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. అతను ఇండియన్ ఐడల్‌ వేదికపై ఆడిషన్ ఇచ్చేందుకు వచ్చాడని ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా అజ్మత్ చెప్పిన సంగతులు విన్న అక్కడున్నవారు భావోద్వేగానికి లోనయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం “సరిగమప లిటిల్ చాంప్స్” (హిందీ)లో విజయం తరువాత తన జీవితం ఎలా సాగిందో అజ్మత్ ఇండియన్ ఐడల్‌ వేదికపై వివరించాడు. తాను చెడు స్నేహాల బారిన పడి మత్తుమందులకు అలవాటు పడ్డానని తెలిపాడు. చివరికి పాటలు కూడా పాడటం మానేశానని చెప్పారు. ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితి హీనంగా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పులను గ్రహించి వాటిని సరిదిద్దుకునేందుకు ఇండియన్ ఐడల్‌ వేదికపై ఆడిషన్ ఇచ్చేందుకు వచ్చానని తెలిపాడు.

Related posts