telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

అజార్ కుమారుడు అసదుద్దీన్ .. పెళ్లి సందడి..ఉల్లాసంగా స్టెప్పులు …

azaruddin son marriage event

నేడు భారత మాజీ సారథి, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొన్నది. అజార్ కుమారుడు అసదుద్దీన్ పెళ్లి సందర్భంగా హైదరాబాద్‌లోని అతని ఇంటిని విద్యుత్తు దీపాలతో డెకరేట్ చేశారు. టెన్నిస్ స్టార్ సానిమా మీర్జా సోదరి ఆనమ్ మీర్జాను అసద్ పెళ్లి చేసుకుంటున్నాడు. బుధవారం రాత్రి అజర్ ఇంటి వద్ద కుటుంబసభ్యుల కోలాహలం నెలకొన్నది.

ఈ వేడుకలో అజర్ మాజీ భార్య సంగీతా బిజ్లానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. పెళ్లి కుమారుడిని హోటల్‌కు తీసుకువెళ్తున్న సమయంలో సంగీతా .. అజర్ ఇంటి వద్దకు చేరుకుని స్వాగతం పలికారు. గ్రీన్ చుడీదార్‌లో వచ్చిన సంగీతా.. ఉల్లాసంగా కనిపించారు. పెళ్లి బ్యాండ్ వాయిస్తుంటే.. అలా ఆమె కొన్ని స్టెప్పులేశారు.

Related posts