telugu navyamedia
culture news sports

ప్రపంచ కప్ గెలవకపోతే… తాను నిరాశకు గురవుతా: అజార్

Azaruddin,World Cup

భారత్ ప్రపంచ కప్ గెలవకపోతే, తాను చాలా నిరాశకు గురవుతానని టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అన్నారు. ఈ ప్రపంచకప్ ను గెలిచే సత్తా భారత్ కు ఉందని అజర్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. టీమిండియానే ఈ ప్రపంచ కప్ లో హాట్ ఫేవరెట్ అని చెప్పారు. ఇంగ్లండ్ టూర్ కు వెళ్లినప్పుడు అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌలర్లు తమకు ఉన్నారని అన్నారు.

అక్కడి పిచ్ లు బౌలర్లకు అనుకూలిస్తే మనకు ఇబ్బంది ఎదురవుతుందని చాలా మంది అంటున్నారని, ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయగల సత్తా ఉన్న బౌలర్లు మనకూ ఉన్నారని చెప్పారు. మన బ్యాటింగ్ లైనప్ కూడా అద్భుతంగా ఉందని అన్నారు. ఇంతటి బలమైన జట్టుతో భారత్ ఈ సారి ప్రపంచ కప్ లో సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

తమిళనాడులో హైఅలర్ట్ .. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు..

vimala p

100 ఆవులు మరణించడం వెనుక ఏదో కుట్ర : చంద్రబాబు

vimala p

చర్చ్‌లో పెళ్లి అడ్డుకున్న యువతి

vimala p