telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కంటి సమస్యలకు.. ఆయుర్వేద చిట్కా..

ayurvedam tips for eye care

వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది స్వీయ తప్పిదాల వలన పూర్తిగా కంటిచూపే కోల్పోతున్నారు. బయట ఎంతో మంది ఇంకా కాంతిని దానం చేస్తారా.. అని ఎదురు చూస్తున్నారు. అంత ముఖ్యమైన కంటిని జాగర్తగా చూసుకోవడం ఎంతో ప్రదానం. ఇప్పటికే కళ్లజోళ్లు, ఇతరత్ర మందులతో చేసిన పొరపాటుకు చికిత్స పొందుతున్నవారు కూడా ఉన్నారు. వీటన్నికి పరిష్కారంగా జీవితాంతం మందులు వాడటమేనా, ఇంకేమైనా పరిష్కారం ఉందా .. అనే, ఉండనే అంటుంది ఆయుర్వేదం.

వారి సలహా మేరకు ఈ పదార్థాలు తింటుంటే ఎలాంటి సమస్యలైన తొలగిపోతాయి. అవేంటో చూద్దాం…

బాహ్య కషాయం:
ఈ కషాయం కంటి చూపుకు ఎంతో సహాయపడుతుంది. చూపు మందగింపు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ఈ కషాయం ప్రతిరోజూ తీసుకోవడం వలన ఎలాంటి కంటి సమస్యలైన తొలగిపోతాయి. మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:
త్రిఫల చూర్ణం – 2 స్పూన్లు
తగినంత నీరు

తయారీ విధానం:
ముందుగా నీటిలో త్రిఫల చూర్ణాన్ని కలిపి ఆపై బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారిన తరువాత వడగట్టి ఉంచుకోవాలి. ఆ తరువాత ఈ నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. ఈ నీటిలో కొద్దిగా తేనె కలిపి తీసుకున్నా కూడా కంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రివేళ భోజనం తర్వాత ఈ కషాయాన్ని నెలరోజులపాటు తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది.

Related posts