telugu navyamedia
రాజకీయ వార్తలు

రామరాజ్య స్థాపనకు ప్రధాని మోదీ కృషి: యూపీ సీఎం యోగి

yogi adityanath

రామరాజ్య స్థాపనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. జార్ఖండ్ లోని బగోదర్ లో బీజేపీ తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370పై స్పందించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచి ఒక్కో ఇటుక ఇవ్వాలని అన్నారు. జమ్ముకశ్మీర్ లో మోదీ 370 అధికరణను రద్దు చేశారు.

దేశ ప్రజలు ఇప్పుడు కశ్మీర్, లఢక్, జమ్మూ ప్రాంతాలకు వెళ్లవచ్చని చేప్పౌ. అలాగే వైష్ణోదేవి, బాబా అమర్‌నాథ్‌ ఆలయాలను సందర్శించుకోవచ్చని యోగి వ్యాఖ్యానించారు. కుల, మత ప్రాదిపదిన దేశం ఎవరి పట్లా వివక్ష చూపలేదని అన్నారు. పొరుగుదేశాలు పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మైనారిటీలను తరిమిగొట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అటువంటి వారు భారత్ లో ఆశ్రయం కోరుతున్నందుకే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వం బిల్లు రూపొందించిందని పేర్కొన్నారు.

Related posts