telugu navyamedia
రాజకీయ వార్తలు

ఏకగ్రీవంగా తీర్పునివ్వడం శుభపరిణామం: వెంకయ్యనాయుడు

venkaiah naidu

అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. అయోధ్య భూవివాదం కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునివ్వడం శుభపరిణామం. చాలా ఏళ్లుగా కొనసాగుతున్నసమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. యావద్భారతం సాధించిన ఘన విజయమిది. కేసు విషయంలో గతాన్ని పక్కనపెట్టి ఐకమత్యంగా ముందుకెళ్తూ.. శాంతి, సామరస్యాలతో కూడిన భారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలి అని అభిప్రాయపడ్డారు.

బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.

Related posts