telugu navyamedia
రాజకీయ వార్తలు

మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు.. ప్రోగ్రామ్ కోడ్ ను పాటించాలి

press media logo

అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలను నిరోధించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మార్గదర్శకాలు జారీచేసింది.

చానళ్లలో చేపట్టే చర్చా కార్యక్రమాలు, డిబేట్లు, రిపోర్టింగ్ సందర్భంగా ప్రోగ్రామ్ కోడ్ ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. చానళ్లతో పాటు కేబుల్ టీవీ ఆపరేటర్లు కూడా ప్రోగ్రామ్ కోడ్ ను పాటించాలని స్పష్టం చేసింది. ఇది అన్ని చానళ్లకు, దేశంలోని అందరు కేబుల్ ఆపరేటర్లకు వర్తిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Related posts