telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇప్పటికే 20 సార్లు పెళ్లైపోయింది… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Avika-Gor

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో అవికా గోర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్తా మావ’, ‘తను నేను’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది అవికా. కానీ, ఇంకా హీరోయిన్‌గా బలమైన పునాది వేసుకోలేదు. అయితే తాజాగా ఆమె “రాజుగారి గది 3″లో హీరోయిన్‌గా నటించింది. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అవికా గోర్‌ ఓ ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఆలోచనల గురించి అవికాను అడిగింది. దీనికి ఆమె చాలా సరదా సమాధానం ఇచ్చింది. “ఇప్పటికే నాకు 20 సార్లు పెళ్లయింది. ఇప్పుడు పెళ్లి పేరు చెబితే నాకు అలసట వస్తోంది. నా వల్ల కాదు’’ అని నవ్వుతూ చెప్పింది అవికా. అలాగే “ఎక్కడికి పోతావు చిన్నవాడా?” సినిమా టైమ్‌లో వచ్చిన రూమర్ల గురించి అవికా స్పందించింది. తెలుగు ఇండస్ట్రీలో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్‌లో నిఖిల్ ఒకరని, ఆయనతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అవికా తెలిపింది. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ముందుగా తానే స్వయంగా చెబుతానని వెల్లడించింది.

Related posts