telugu navyamedia
సినిమా వార్తలు

రీఎంట్రీకి సిద్ధమైన “ఉయ్యాల జంపాల” హీరోయిన్

Avika-Gor

“ఉయ్యాల జంపాల” చిత్రంతో తెలుగులో మంచి హిట్ ను అందుకుంది అవిక గోర్. ఆ తర్వాత తెలుగులో “సినిమా చూపిస్తా మావ”, “ఎక్కడికి పోతావు చిన్నవాడా” వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే మూడేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకి దూరంగా ఉంటోంది ఈ బ్యూటీ. ఈ మూడేళ్లలో హిందీలో బుల్లితెరపై పలు సీరియల్స్, రియాలిటీ షోలలో నటించింది. ప్రస్తుతం ముందుకంటే స్లిమ్‌గా తయారైంది అవిక గోర్. స్లిమ్ లుక్‌లో ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. ఈ మధ్య వరుసగా డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆదిల్ ఖాన్, కృతిక సోలంకి వంటి కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో అవిక చేసిన డాన్స్ వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి. అలాగే ఇప్పటివరకూ పద్ధతైన పాత్రల్లో కనిపించిన అవిక ఇకపై గ్లామరస్ లుక్‌లోనూ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతోంది. మరి స్లిమ్ గా మారి రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి తెలుగులో ఏమైనా ఆఫర్లు వరిస్తాయేమో చూడాలి.

Related posts