telugu navyamedia
telugu cinema news

అవెంజర్స్-4: ఎండ్ గేమ్” లేటెస్ట్ ట్రైలర్

Avengers-4

హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు “అవెంజర్స్” చిత్రాలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “అవెంజర్స్-4: ఎండ్ గేమ్” నుంచి మరో ట్రైలర్ తాజాగా విడుదలైంది. గత కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం నుంచి మొదటి ట్రైలర్ ను విడుదల చేశారు.

 

ట్రైలర్ నిడివి రెండు నిమిషాలు ఉండగా… అందులో ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్, హల్క్, హాక్ ఐ, బ్లాక్ విడో వంటి సూపర్ హీరోలు కన్పించారు. ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 289 మిలియన్ వ్యూస్ తో ప్రపంచ రికార్డును సృష్టించింది.

 

ఈ సందర్భంగా మార్వెల్ స్టూడియో ప్రపంచవ్యాప్తంగా తమ సూపర్ హీరోలకు ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. అవెంజర్స్ సిరీస్ లో ఇదే చివరి చిత్రమని ఇప్పటికే నిర్మాణసంస్థ ప్రకటించింది. ఆంథోనీ రుస్సో జాయ్ రుస్సోలు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

ఆగష్టులో రానున్న “సైరా” ?

ashok

హైదరాబాద్ రోడ్లపై బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా…!

vimala p

కనక పరిమళాలు…

vimala p