telugu navyamedia
Uncategorized సినిమా వార్తలు

రికార్డుల మోత మోగిస్తున్న “అవెంజర్స్”

Avengers-4

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన చివరి చిత్రం ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పింది. మార్వెలస్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. మార్వెల్ కామిక్ బుక్‌ సిరీస్‌లో అవెంజర్స్ ఎండ్‌గేమ్ చివరి చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం 1.2 బిలియన్ డాలర్లు(రూ. 8,376 కోట్లు) కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ పండితులు లెక్కలేస్తున్నారు. ఆ దేశం ఈ దేశం అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రికార్డ్ రేంజ్‌లో ఓపెనింగ్స్ వచ్చాయి. చైనా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా మరో 38 దేశాల మార్కెట్‌లలో ఈ చిత్రం చరిత్రను తిరగరాసింది.

గురువారం రాత్రి నుంచి ఆదివారం వరకు అమెరికా, కెనడాలోనే ఈ చిత్రానికి 350 మిలియన్ డాలర్ల(రూ. 2 వేల 443 కోట్ల 43 లక్షలు) కలెక్షన్లు వచ్చినట్టు డిస్నీ సంస్థ అంచనాలు వేస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద సినిమా మార్కెట్ అయిన చైనాలో అవెంజర్స్ విడుదలైన మొదటిరోజే 330 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఇక ఇండియాలో 2845 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 152 కోట్లను కొల్లగొట్టింది. బాలీవుడ్ సినిమాలకు వచ్చే కలెక్షన్లను మించి వచ్చాయంటే ఈ సినిమా కోసం అభిమానులు ఏ విధంగా వేచిచూశారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ చైన్‌గా ఉన్న అమెరికా సంస్థ ఏఎమ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఉదయం ఏడు గంటల నుంచే అదనపు షోలను ప్రదర్శిస్తూ కొన్ని లొకేషన్లలో 72 గంటల పాటు నాన్‌స్టాప్‌గా ఇదే చిత్రాన్ని ప్రదర్శిస్తోంది. మూడు గంటల వ్యవధి ఉన్నప్పటికీ.. చిత్రాన్ని ప్రేక్షకులు ఆనందంగా వీక్షిస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో కూడా కొన్ని దేశాల్లో షోలను ప్రదర్శించడంతో సినిమా ముగిసి ఇంటికి వెళ్లే సరికి తెల్లవారిపోతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Related posts