telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అవతార్ సిరీస్ ప్రచారంలో.. కొత్త పుంతలు.. కార్ ప్రదర్శన..

avatar series campaign with car

అవతార్ చిత్రం హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి. ఈ చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా అవతార్ 2,3,4,5 పార్ట్‌లు రూపొందుతున్నాయి. అవతార్ 2 చిత్రాన్ని డిసెంబర్ 17, 2021న విడుదల చేయనున్నట్టు ఆ మధ్య కామెరూన్ ప్రకటించారు. తాజాగా చిత్రానికి సంబంధించి నాలుగు కాన్సెప్ట్ పోస్టర్స్ విడుదల చేశారు. ఇందులో పండోరా ప్రపంచాన్ని పరిచయం చేశారు. అంతేకాక అవతార్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఎలక్ట్రిక్‌ కార్‌ డైమ్లర్‌-బెంజ్‌ను లాస్‌ వెగాస్‌లో ఆవిష్కరించారు. ఈ కారు ఆర్గానిక్ బ్యాటరీతో రూపొందగా, డ్రైవర్ స్పర్శకి స్పందిస్తూ పక్కకి కూడా తిరుగుతుంటుంది. 30 డిగ్రీలు పక్కకు తిరిగేలా నాలుగు కారు చక్రాల ఇరుసులను తయారు చేశారు. కారు ఉన్న ప్రాంతం నుండే అది దాని దిశ మార్చుకోగలదు. పూర్తి ఎలక్ట్రిక్ కారుగా రూపొందిన ఇది దాని అంతట అదే ప్రయాణించగలదు.

ఈ కారుకి ప్రాణం ఉంది. శ్వాస కూడా తీసుకుంటుంది అని కామెరూన్ వ్యాఖ్యానించారు. సెంట్రల్‌ కంట్రోల్‌ యూనిట్‌ను చేతితో పట్టుకోవడం ద్వారా నడపవచ్చు. చేయి పైకెత్తితే మెనూ సెలక్షన్‌ కంప్యూటర్‌ తెర కళ్లముందు కనిపిస్తుంది. వేళ్లతో డైరెక్షన్‌ ఇస్తూ కారును నడపవచ్చు. కారు వెనుక భాగంలో చేపకి మాదిరిగా మొప్పలు నిర్మించి ఉండడం వలన కారు శ్వాస తీసుకున్నట్టు అనిపిస్తుంటుంది. చక్రాలు లేని ఈ కారు ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందో తెలీదు అని కామెరూన్ అన్నారు.

Related posts