telugu navyamedia
news political Telangana

తెలంగాణలో జనవరి 8న ఆటో బంద్‌

Autos bandh telangana On January 8

జనవరి 8న ఒక్క రోజు ఆటోబంద్‌ కు తెలంగాణ ఆటో డ్రైవర్‌ జేఏసీ పిలుపునిచ్చింది. ఫైనాన్షియర్ల వేధింపులను ఆరికట్టడానికి ప్రభుత్వం అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరులతో ఆ సంఘాల నేతలు మహ్మద్‌ అమానుల్లాఖాన్‌(టీఏడీజేఏసీ), బి. వెంకటేశం(ఏఐటీయుసీ)లు మాట్లాడారు.

పద్మప్రియా ఆటో ఫైనాన్స్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆటో డ్రైవర్‌ ఎస్కే.జానీ మృతి చెందాడని, ఆ ఫైనా న్స్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని వారు కోరారు. ఈ ఫైనాన్స్‌ సంఘాలు పార్టీలకు పార్టీ నిధి ఇస్తుండటంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Related posts

కొలంబో ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు కలకం

vimala p

మోదీ శకుని పాత్ర పోషిస్తున్నారు: బుద్దావెంకన్న

vimala p

ఉగ్రవాదం తమ దేశంలో లేదంటూనే.. 14మందిని బలిచ్చిన పాక్..

vimala p