telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీలో అంబులెన్స్ లుగా ఆటోలు…

మన దేశంలో రోజుకు 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే అందులో అధికంగా కేసులు వస్తున్న రాష్ట్రాలలో దేశ‌రాజ‌ధాని ఢిల్లీ కూడా ఉంటుంది. అక్కడ క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ఆక్సీజ‌న్ అంద‌క ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు.  కొంత‌మంది స‌కాలంలో ఆసుప‌త్రుల‌కు చేరుకోలేక మ‌ద్య‌లోనే ప్రాణాలు వ‌దిలేస్తున్నారు.  ఢిల్లీలో  ఆక్సీజ‌న్‌తో పాటుగా, అంబులెన్స్‌ల కొర‌త కూడా తీవ్రంగా ఉన్న‌ది.  దీంతో ఢిల్లీకి చెందిన ట‌ర్న్ యువ‌ర్ క‌న్స‌ర్న్ ఇన్ టు యాక్ష‌న్ అనే సంస్థ రాజ్య‌స‌భ స‌హ‌కారంతో 10 ఆటోల‌ను అంబులెన్స్ లుగా మార్పులు చేసింది.  ఇందులో పూర్తిస్ధాయిలో ఆక్సీజ‌న్‌, పీపీఈ కిట్లు, అన్నీ అందుబాటులో ఉంటాయి.  పెషెంట్ల‌ను స‌కాలంలో ఆసుప‌త్రుల‌కు చేర్చ‌డంలో త‌మ‌వంతు పాత్ర‌ను పోషిస్తాయ‌ని ట‌ర్న్ యువ‌ర్ క‌న్స‌ర్న్ ఇన్ టు యాక్ష‌న్ సంస్థ పేర్కోన్న‌ది.  భ‌విష్య‌త్తులో దేశ‌వ్యాప్తంగా మ‌రిన్ని ఆటో అంబులెన్స్ ల‌ను అందుబాటులోకి తీసుకొస్తామ‌ని పేర్కొన్న‌ది.

Related posts