telugu navyamedia
క్రైమ్ వార్తలు

యువతికి యాక్సిడెంట్… కళ్ళు తెరిచి చూస్తే నగ్నంగా… కుర్చీకి కట్టేసి

Nathalie Birli

ఆస్ట్రియాకు చెందిన నటాలీ బిర్లీ అనే 27 ఏళ్ల ట్రయాథ్లెట్‌. ఒకరోజు ఆ క్రీడాకారిణి సైకిల్ పై వెళ్తుండగా… హఠాత్తుగా వెనకనుంచి వచ్చిన ఓ కారు ఆమె సైకిల్‌ను ఢీకొంది. దీంతో కింద పడిన ఆమె తలపై కారు డ్రైవర్‌ ఓ కర్రతో మోదాడు.

 

దీంతో స్పృహ కోల్పోయిన ఆమె కళ్లు తెరిచి చూస్తే నగ్నంగా ఉండడమే కాకుండా ఓ కుర్చీకి కట్టేసి ఉంది. అంతేకాకుండా తీవ్ర ఆగ్రహంతో ఉన్న అతడు కత్తితో బెదిరిస్తూ మద్యం తాగాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. వినకపోవడంతో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపాలని ప్రయత్నించాడు. అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని భావించిన నటాలీ ఆ ఇంట్లో చాలా ఆర్చిడ్‌ పూల మొక్కలున్నట్టు ఆమె గ్రహించింది. తనకు కూడా ఆ పూలంటే పిచ్చి అంటూ అతడిని మెల్లిగా మాటల్లోకి దించి అతని గురించి తెలుసుకుంది.

తానో తోటమాలినని, తండ్రి చనిపోగా తల్లి మద్యానికి బానిసయ్యిందని తన జీవితం గురించి చెప్పుకొచ్చాడు. అలాగే ప్రియురాలు చేసిన మోసం కూడా లోకంపై కసిని పెంచిందని ఆమెతో అన్నాడు. అతను మంచి మూడ్ లోకి మారిపోయాడని గ్రహించిన నటాలీ.. ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దామని కిడ్నాపర్‌కు సూచించింది. దీని ప్రకారం తనను వదిలేస్తే అందరికీ యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలాయని చెబుతానని తెలిపింది. దీనికి అంగీకరించిన అతడు స్వయంగా కారులో ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయాడు.

అయితే నటాలీ మాత్రం ఊరుకోకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 33 ఏళ్ల ఆ కిడ్నాపర్‌ జైలు పాలయ్యాడు. నటాలీ తెలివిగా ఆ కిడ్నాపర్ నుంచి తప్పించుకుని, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన తీరుపై పోలీసులు ప్రశంసలు కురిపించారు. 

Related posts