telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 ప్రపంచ కప్ : .. పోరాడి ఓడిన .. బంగ్లాదేశ్ ..

australia won on bangladesh on world cup match

ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ భారీ స్కోర్లకు స్వరధామమైన ట్రెంట్‌బ్రిడ్జ్ పిచ్‌పై మరోసారి పరుగుల వరద పారింది. మొత్తం 714 పరుగులు నమోదైన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్‌లో ఆకట్టుకున్న ఆసీస్ 48 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచి.. 10 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు 50 ఓవర్లలో 5 వికెట్లకు 381 పరుగులు చేశారు.

australia won on bangladesh on world cup matchవిధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (147 బంతుల్లో 166; 14 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకానికి ఉస్మాన్ ఖవాజ (72 బంతుల్లో 89; 10 ఫోర్లు), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు తోడవడంతో ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో తమ రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. తమ వన్డే చరిత్రలోనే అత్యధిక లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 333 పరుగులకు పరిమితమైంది. ముష్ఫికర్ రహీమ్ (97 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా.. తమీమ్ ఇక్బాల్ (62; 6 ఫోర్లు), మహ్ముదుల్లా (50 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధించారు. వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related posts