telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

నో ఆడియన్స్… ఓన్లీ ప్లేయర్స్… ఆసీస్-కివీస్ వన్డేకి కరోనా ఎఫెక్ట్

cricket

మార్చి 13, 2020 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డే ఒక్క అభిమాని కూడా లేకుండా ఖాళీ స్టేడియంలో జరిగింది. ప్రేక్షకులు లేకపోవడంతో సిడ్నీ మైదానం బోసిపోయింది. కరోనా వైరస్ దెబ్బతో మ్యాచ్ ను వీక్షకులు లేకుండా నిర్వహించాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఈ పోరులో ఆసీస్ 71 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసి మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి 258 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (67), ఫించ్ (60) తొలి వికెట్ కు 124 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. వీళిద్దరూ ఔటైన తర్వాత ఆసీస్ 164/4తో తడబడినా.. లబుషేన్ (56), మిచెల్ మార్ష్ (27)తో కలిసి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. కమిన్స్ (3/25), మిచెల్ మార్ష్ (3/29), ఆడమ్ జంపా (2/50), హేజిల్ వుడ్ (2/37) విజృంభించడంతో కివీస్ 41 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది. గప్తిల్ (40) టాప్ స్కోర్ చేశాడు. సాధారణంగా బ్యాట్స్ మన్ సిక్స్ కొడితే ఆ బంతిని క్యాచ్ పట్టుకునేందుకు అభిమానులు పోటీపడుతుంటారు. కానీ తొలి వన్డేలో ఇందుకు విరుద్ధమైన దృశ్యం కనిపించింది. ఫించ్ సిక్సర్ కొట్టగా.. ఆ బంతిని ఇచ్చే వాళ్లే లేకపోవడంతో బౌండరీ లైన్ దగ్గర ఉన్న ఫెర్గ్యూసన్ స్టాండ్స్ లోకి దూకి బంతిని వెతుక్కుని ఇవ్వాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related posts