telugu navyamedia
news sports trending

146 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం

Australia beat India by 146 runs, level series 1-1

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒప్టస్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం చవి చూసింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేనను ఆసీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మన్స్ చేతులెత్తేశారు. ఫలితంగా భారత్ 146 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది.

ఓవర్ నైట్ స్కోరు 112/5తో ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 28 పరుగులు చేసిన ఆంధ్రా ఆటగాడు హనుమ విహారిని స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. మరో ఎండ్‌లో వికెట్ కీపర్ పంత్ కాసేపు పోరాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. 30 పరుగులు చేసిన అతడు.. లియాన్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మూడు పరుగుల వ్యవధిలోనే మిగిలిన ముగ్గురు అవుటవడంతో భారత్ 140 పరుగులకు ఆలౌట్ అయింది.

టీమిండియా బ్యాట్స్‌మన్లలో పంత్ 30, రహానే 30, విహారి 28, విజయ్ 20, కోహ్లీ 17 మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లియాన్ తలో మూడు, కమ్మిన్స్, హజెల్‌వుడ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతమైన బౌలింగ్ వేసిన లియాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది.

Related posts

‘రెచ్చిపోదాం బ్రదర్’ అంటున్న‘ఎఫ్ 2’

ashok

పెళ్ళికి సిద్ధమైన యువహీరో విశాల్

vimala p

కుమార్తెలే .. తండ్రికి తలకొరివి.. రుణం తీర్చుకోగలిగాం..

vimala p