telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ప్రపంచ కప్ : .. ఇంగ్లాండ్ వ్యూహం.. ఆస్ట్రేలియా బ్యాటింగ్..

australia bating on england in world cup match

నేడు ప్రపంచ కప్ లో భాగంగా ఆతిధ్య జట్టు ఆస్ట్రేలియా తో పోటీపడుతోంది. లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు సారథి ఆరోన్ ఫించ్ సెంచరీ సాధించాడు. ఓపెనర్ గా బరిలో దిగిన ఫించ్ ధాటిగా ఆడుతూ 115 బంతుల్లో 100 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఫించ్ 11 ఫోర్లు, 2 సిక్సులు కొట్టాడు. అయితే, సెంచరీ పూర్తిచేసుకున్న కాసేపటికే ఆర్చర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ టోర్నీలో ఫించ్ కి ఇది రెండో శతకం.

మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహజశైలికి భిన్నంగా నిదానంగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. వార్నర్ 61 బంతుల్లో 6 ఫోర్లతో 53 పరుగులు చేసి మొయిన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఉస్మాన్ ఖవాజా 23 పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో స్మిత్, మ్యాక్స్ వెల్ ఆడుతుండగా ఆసీస్ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

Related posts