telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఆడి ఏ6 … ఇండియాకు వచ్చేసింది.. 54 లక్షలే..

audi a6 in india

లక్సరీ వెహికల్ గా పేరుగాంచిన ఆడి ఏ6 వెహికల్ మార్కెట్ లోకి లాంచ్ అవుతుంది. ఆడి నుండి వస్తున్న లగ్జరీ సెడాన్ వెహికల్ ఆడి ఏ6. ఈ వెహికల్ ధర 54.20 లక్షలుగా నిర్ణయించబడింది. కొత్త టెక్నికల్ అప్డేట్స్ తో ఈ వెహికల్ వస్తుంది. ఓల్డ్ వర్షన్ కన్నా స్టైల్, స్పోర్టివ్ లుక్ లో ఈ వెహికల్ వస్తుంది. ఆడి ఏ 6 వెహికల్ డ్యుయల్ టోన్ అల్లాయి వీల్స్ తో పాటుగా పొడవైన వీల్ బేస్ కలిగి ఉంటుంది. ఆడి ఏ 6 8వ జనరేషన్ వెహికల్ గా వస్తున్న ఈ సరికొత్త వెహికల్ క్యాబిన్ పూర్తిగా మార్చబడ్డది.

ఈ వెహికల్ లో 8 ఎయిర్ బ్యాగ్స్, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టెం తో పాటుగా రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. 360 డిగ్రీస్ కెమెరా కూడా ఉంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే 2.0 లీటర్ టి.ఎఫ్.ఎస్.ఐ పెట్రోల్ ఇంజిన్ తో 240 బి.హెచ్.పి పవర్.. 370 ఎన్.ఎం టార్క్ కలిగి ఉంటుంది. ఈ వెహికల్ 7 స్పీడ్ డి.ఎస్.జి ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది. మొత్తానికి సరికొత్త ఆడి ఏ 6 కొత్త మెరుగులతో మరింత కంఫర్ట్ గా కనిపిస్తుంది.

Related posts