telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాఠశాలపై దాడి .. 28మృతి.. రెచ్చగొట్టొద్దు అంటున్న ట్రంప్..

trump in america president election race

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా దాడులపై మాట్లాడుతూ.. ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి మాకు నిమిషం పట్టదు. మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయద్దు, అంటూ ఘాటుగానే స్పందించారు. అంతేకాదు ఇంకొక సారి ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్ లో ప్రఖ్యాత ప్రాంతాలన్నిటినీ నేలమట్టం చేస్తామంటూ 52 ముఖ్య ప్రాంతాలని లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించారు. నిన్నటి రోజున చనిపోయిన ఇరాన్ మేయర్ జనరల్ సులేమానీ హత్యని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఎంతో మంది అమెరికన్స్ పై సులేమాన్ దాడి చేశారని, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారని అలంటి వాళ్లకి చావు సరైన శిక్షని అన్నారు. అంతేకాదు ఇరాన్ లో నిరసన కారులని సైతం చంపారని తాము విధించింది సరైన శిక్ష ని ప్రకటించారు. కాగా తాజాగా అమెరికా కార్యాలయం పై దాడికి ఆదేశించారని , కొంతమంది అధికారులపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అమెరికా బలగాలు మోహరించిన ప్రాంతంలో రెండు అత్యంత శక్తివంతమైన రాకెట్లు పడ్డాయి. అలాగే బాగ్దాద్ లో అమెరికా కార్యాలయం ఉన్న గ్రీన్ జోన్ ప్రాంతంలో రెండు రాకెట్లు పడ్డాయి. వీటివల్ల ఎలాంటి నష్టం జరిగింది అమెరికాకి అనేది లెక్కలు తెలియలేదు. మా దాడులు మరిన్ని ఉంటాయని ఇరాన్ హెచ్చరించిన నేపధ్యంలో ట్రంప్ బదులుగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ట్రంప్ హెచ్చరికతో ఇరాన్ వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నయాని అంటున్నారు నిపుణులు.

ఇరాక్ పై అమెరికా వైమానిక దళాలు నిర్వహించిన క్షిపణుల దాడులు మిగిల్చిన పెను ప్రకంపనలు యుద్ధ వాతావరాణికి దారి తీస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఈ సారి లిబియా రాజధాని ట్రిపోలిపైకి క్షిపణులు విరుచుకు పడ్డాయి. ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై తాజాగా చోటు చేసుకున్న క్షిపణుల దాడుల్లో 28 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసరంగా చికిత్సను అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఫలితంగా- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల విషయాన్ని లిబియా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ అకార్డ్ (జీఎన్ఏ) అధికార ప్రతినిధి అమీన్ అల్-హష్మి ధృవీకరించారు. 28 మంది మరణించారని వెల్లడించారు. లిబియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సైనిక ప్రభుత్వమే ఈ దాడులకు పాల్పడినట్లు చెబుతున్నారు. లిబియా సైనిక ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి నుంచి అండదండలు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి జనరల్ ఖలీఫా హఫ్తర్ సారథ్యాన్ని వహిస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకే ట్రిపోలిలోని సైనిక పాఠశాలపై ఈ వైమానిక దాడులను చేపట్టారని సమాచారం. ఈ దాడులకు ఎవరు పాల్పడ్డారనే సమాచారంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Related posts