telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యమే… మరి ఎప్పుడు తినాలి.. !

at what time apple should be taken for health

అందరూ సాధారణంగా చెప్పే మాట.. రోజుకో యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌ని. అందుకే నిత్యం ఒక యాపిల్ పండును ఖచ్చితంగా తినాల‌ని వైద్యులు కూడా స‌ల‌హా ఇస్తుంటారు. యాపిల్ నిజానికి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను ఇస్తుంది. దాని ద్వారా మ‌న‌కు అనేక పోష‌కాలు కూడా అందుతాయి. అయితే యాపిల్‌ను రోజులో ఏ స‌మ‌యంలో తినాల‌నే విష‌యంపై చాలా మంది సందేహ ప‌డుతుంటారు. మ‌రి యాపిల్‌ను అస‌లు ఏ స‌మ‌యంలో తింటే మంచిదో తెలుసుకుందాం ..!

at what time apple should be taken for healthయాపిల్‌ను ప‌గ‌టి పూట తిన‌డం చాలా ఉత్త‌మ‌మ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. అందుకు కార‌ణం యాపిల్ లో ఉండే పెక్టిన్, పీచు ప‌దార్థాలే. యాపిల్‌ను ఉద‌యం లేదా రాత్రి తింటే అందులో ఉన్న పెక్టిన్‌, పీచు ప‌దార్థాల వ‌ల్ల యాపిల్ త్వ‌రగా జీర్ణం కాదు. దీని తో జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక యాపిల్‌ను ప‌గ‌టి పూట తింటే రాత్రి మ‌ళ్లీ భోజ‌నం చేసే వ‌ర‌కు ఎక్కువ స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి యాపిల్ పండ్లు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. ఈ క్రమంలో యాపిల్‌ను ప‌గ‌టి పూటే తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts