telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రవిచంద్రన్‌ అశ్విన్‌ .. సరికొత్త రికార్డుకు అతిసమీపంలో ..

aswin ravichandran will get new record

చాలా విరామం తరువాత జట్టులోకి వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. దీంతో సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌటయ్యారు. అయితే, అశ్విన్‌ అరుదైన రికార్డుకు అతిచేరువలో ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక వేగంగా 350 వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌తో సమంగా నిలిచేందుకు ఒక వికెట్ దూరంలో నిలిచాడు. 66 టెస్టుల్లోనే మురళీధరన్‌ 350 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. తన కెరీర్‌లో 66వ టెస్టు ఆడుతున్న అశ్విన్‌ ఇప్పటికే 349 వికెట్లు పడగొట్టాడు.

తొలి టెస్టు ఆఖరి రోజు ఆట మిగిలి ఉండటంతో అతడు మరో వికెట్‌ పడగొట్టి మురళీధరన్‌ రికార్డును సమం చేస్తాడని అందరూ భావిస్తున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌ 502/7వద్ద డిక్లేర్‌ చేయగా దక్షిణాఫ్రికా 431 పరుగులు చేసింది. అనంతరం 91 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 323/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 395 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 11 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ సేన విజయం సాధించాలంటే ఆఖరి రోజు ఇంకా 384 పరుగులు చేయాలి.

Related posts