telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

భారత వైమానిక దళ అస్త్ర .. ప్రయోగం విజయవంతం..

astra from IAF launched successfully

నేడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయ్-30 జెట్ ద్వారా గాలిలో కదిలే లక్ష్యాన్ని ను గాలిలోనే ఢీకొని పేల్చివేసే ‘అస్త్ర’ అనబడే మిస్సైల్ ను విజయవంతంగా ప్రయోగించింది. భారతీయ వైమానికా దళం ‘అస్త్ర’ మిసైల్ ను ఒడిస్సా తీరం వద్ద ప్రయోగించి విజయం సాధించారు. ప్రయోగం ఆసాంతం ఎలాంటి ఆటుపోట్లు మరియు అడ్డంకులు లేకుండా అంతా సాఫీగా సాగింది. ప్రపంచంలోనే శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటైన సుఖోయ్-30 జెట్ నుంచి వెలువడిన ‘అస్త్ర’ గాలిలో కదులుతూ వెళ్లే లక్ష్యాన్ని సైతం చాలా ఖచ్చితంగా ఢీకొట్టడం విశేషం. మన భారతదేశం నుంచి గాల్లో నుండి గాల్లోనే కదిలే టార్గెట్ ను ఢీ కొట్టిన మొట్టమొదటి మిస్సైల్ ‘అస్త్ర’ అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తన స్టేట్మెంట్లో పేర్కొంది. ఇలా ప్రయోగించి విజయం సాధించిన అతి కొద్ది దేశాల్లో ఇప్పుడు భారత్ ఒకటి.

ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ అంతా టెక్స్ట్ బుక్ మరియు మాన్యువల్స్ ఆధారంగానే జరిగిందని. ఇంకా రేడర్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ మరియు సెన్సార్లు మిసైల్ ఖచ్చితంగా వెళ్లి లక్ష్యాన్ని ఢీకొన్నట్లు నిర్ధారించాయని డిఫెన్స్ వారు స్టేట్మెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ డీఆర్డీఓ మరియు నావికా దళానికి సంబంధించిన విభాగాలను ప్రశంసించారు. ఇక ‘అస్త్ర’ విషయానికి వస్తే మన కనుచూపు మేరలో కూడా లేని టార్గెట్ ను 70 కిలోమీటర్ల రేంజ్ వరకు గాలిలో నుంచి గాల్లోనే గాల్లోకి కలిపేయడం దీని స్పెషాలిటీ. ‘అస్త్ర’ లక్ష్యం వైపుగా గంటకు 5,555 కిలోమీటర్ల వేగంతో దూసుకొని వెళ్లి దాదాపు 15 కిలోగ్రాముల భారీ పేలుడు వార్ హెడ్ ను లక్ష్యం వైపు విసురుతుంది. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ మరియు డిఫెన్స్ ఆర్గనైజేషన్ 50 గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో కలిసి రూపొందించారు.

Related posts