telugu navyamedia
రాజకీయ వార్తలు

అసోం ప్రజల హక్కులను ఎవరు హరించలేరు: సీఎం సోనోవాల్

sonawal cm assam

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నా నిరసనల నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ స్పందించారు. అసోం ప్రజల హక్కుల్ని ఎవరూ హరించలేరని పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. అసోంలో కూడా ప్రజలు ఆందోళనను తీవ్రం చేశారు. తమ భాష, సంస్కృతిని కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ప్రజలకు భరోసా కల్పించారు. అసోం గడ్డపై జన్మించిన బిడ్డల హక్కుల్ని ఏ ఒక్కరూ హరించలేదు. మన భాషకుగానీ, ఉనికిగానీ ఎలాంటి ముఫ్పు వాటిల్లదు. అసోం గౌరవానికి ఏవిధంగా విఘాతం కలగదు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పుతూ ముందుకు సాగుతామన్నార. నిరసనల నేపథ్యంలో పదిరోజులుగా రాష్ట్రంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Related posts