telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : .. రేపటి నుండి .. శీతాకాల సమావేశాలు..

Ap Assembly

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం ప్రశ్నోత్తరాల తర్వాత జరిగే శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టేందుకు అధికార పక్షం కసరత్తు చేస్తుండగా… మరో వైపు వైకాపా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తెదేపా సన్నద్ధమవుతోంది. నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసే యోచనలో సర్కారు ఉంది. సుమారు 20 అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాఠశాల విద్యావిధానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి.. 20 అంశాలపై చర్చించాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల తొలిరోజు దిశ ఘటనపై చర్చించి… మహిళల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రభుత్వం వెల్లడించే అవకాశముంది.

ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష తెదేపా కూడా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆరునెలల వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందుకు 21 అంశాలను ఎంచుకున్న ఆపార్టీ.. వీటిపై సమగ్ర చర్చ జరగాలంటే కనీసం రెండు వారాలైనా సమావేశాలు నిర్వహించాలని రేపు జరిగే బీఏసీలో పట్టుబట్టనుంది. ప్రజల్లో వివిధ అంశాలపై వ్యక్తమవుతున్న నిరసనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ.. ప్రతి రోజు ఏదో ఒక సమస్యపై నిరసన కార్యక్రమాలు సభ ప్రారంభానికిముందు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

Related posts