telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

హైదరాబాద్ “ఏషియన్” కార్యాలయాల్లో ఐటీ దాడులు

Asian cinemas

ముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమా కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఈ సంస్థ కార్యాలయాలతో పాటు, అధినేతలు నారాయణదాస్, సునీల్ నారంగ్ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. వారి సన్నిహితుల నివాసాల్లోనూ సోదాలు జరిపినట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలోని ఎ.ఎమ్.బి మాల్‌ను హీరో మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సినిమా సంస్థ నిర్మించింది.

త్వరలో మరో అగ్ర హీరో అల్లు అర్జున్‌తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సంస్థ నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న సినిమాను నిర్మిస్తోంది. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు ఏషియన్ సినిమాస్ పేరిట చాలా సినిమా మాల్స్ ఉన్నాయి.

Related posts