క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

బీజేపీపై మండిపడ్డ అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju, Slams, BJP

ఎప్పుడో జరిగిన పాత కేసులను తిరగదోడటం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు మంచిది కాదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు వారెంట్ ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారం మొత్తం బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు.

బాబ్లీ ప్రాజెక్టు ఘటన కేసులో తనను ఎందుకు తప్పించారంటూ కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాలను పశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మీడియా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

Related posts

అందులో నిజామాబాద్ దే అగ్రస్థానం

admin

పేదింటి ఆడపిల్లకు పెళ్లి కానుక…

admin

మరోసారి తప్పులో కాలేసిన అమిత్ షా..

admin

Leave a Comment