telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ ఓపెనర్ గా వస్తే బాగుంటుంది…

ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదని ఆ జట్టు బౌలింగ్‌ మాజీ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా అన్నాడు. యూఏఈలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కోహ్లీ పై తీవ్ర ఒత్తిడి ఉందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైన కోహ్లీ.. సునాయాసంగా వికెట్‌ సమర్పించుకున్నాడని నెహ్రా పేర్కొన్నాడు. ఆశిష్‌ నెహ్రా మాట్లాడుతూ… ‘యూఏఈలో పరిస్థితులు విరాట్ కోహ్లీకి అంతగా అనుకూలించడం లేదు. దీంతో కోహ్లీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైన విరాట్ వికెట్‌ సమర్పించుకున్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు పెద్దగా వికెట్లు సాధించకపోయినా.. వారు అంత సులువుగా పరుగులు ఇవ్వడం లేదు. ఇక్కడ ఆర్సీబీ కెప్టెన్‌కోహ్లీకి ఏ విధమైన ఛాన్స్ ఇవ్వని ఢిల్లీని ప్రత్యేకంగా అభినందించాలి’ అని అన్నాడు. అరోన్‌ ఫించ్‌ జట్టులో లేనప్పుడు విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా దిగితేనే మంచిదని భారత మాజీ బౌలర్ ఆశిష్‌ నెహ్రా పేర్కొన్నాడు. ‘కనీసం వచ్చే మ్యాచ్‌ల్లోనైనా ఆరోన్ ఫించ్‌ లేని పక్షంలో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావాలి. ఆర్సీబీ జట్టులో ఫించ్‌ లేకపోతే.. కోహ్లీనే ఓపెనర్‌గా కరెక్ట్‌’ అని నెహ్రా తెలిపాడు.

Related posts