telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అయోధ్య చరిత్రలో బాబ్రీ మసీదు ఉంటుంది: అసదుద్దీన్ ఒవైసీ

asaduddin owisi

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఈ రోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎన్నటికీ తుడిచిపెట్టుకుపోదని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, ఉంటుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా ఎన్నో ఏళ్లుగా ఉన్న రామమందిర నిర్మాణ డిమాండ్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. అయోధ్యలోని ఆ సంస్థ రాంలల్లాకు చెందుతుందని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అక్కడి ప్రాంతానికి సమీపంలో మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీం ఆదేశించింది. దీంతో రామ మందిర నిర్మాణానికి ఈ రోజు భూమిపూజ కార్యక్రమం జరిగింది.

Related posts