telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కోహ్లీ-రోహిత్‌ మధ్య విభేదాలు లేవు .. ఇద్దరు దేశం కోసమే ఆడుతున్నారు..

as a fact no quarrels between kohli and rohit

ఇద్దరి మధ్య విభేదాలు అంటే ఎంత ఇష్టంగా వింటారో.. ఎంత ఆహ్లాదంగా చూస్తారో.. లోకులు మారరు. ఈ ఇద్దరి క్రికెటర్లు .. కోహ్లీతో రోహిత్‌ విభేదాల గురించి కొన్ని రోజులుగా పెద్ద చర్చే జరుగుతుంది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే ముందు సారథి కోహ్లీ మీడియా సమావేశంలోనూ స్పష్టం చేశాడు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు మాత్రం వీరిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని టీమిండియా సారథిగా కోహ్లీ స్థానాన్ని రోహిత్‌ భర్తీ చేయగలడా?అని ట్విటర్‌లో ప్రశ్నించాడు. దీనిపై పాక్ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్ స్పందిస్తూ.. ‘అవసరం లేదు’ అంటూ బదులిచ్చాడు.

ఇంతలో మరో అభిమాని కోహ్లీ, రోహిత్‌ ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారని ట్వీట్‌ చేయగా.. కోహ్లీ పేరునే అక్తర్‌ సూచించాడు. దీనిని బట్టి చూస్తే కోహ్లీ నాయకత్వాన్నే అక్తర్‌ కోరుకుంటున్నాడని తెలుస్తోంది. రోహిత్‌ శర్మ ప్రస్తుతం ట్విటర్లో పెట్టిన ఓ సందేశం చర్చనీయాంశంగా మారింది. పెవిలియన్‌ నుంచి మైదానంలోకి వెళ్తున్న ఫొటోను పంచుకున్న రోహిత్‌.. ‘నేను ప్రతిసారీ కేవలం జట్టు కోసం కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతాను’ అంటూ రాసుకొచ్చాడు.

Related posts