telugu navyamedia
సినిమా వార్తలు

కోలీవుడ్ హీరో ఆర్య, సాయేషాల వివాహం… ఈనెల 10న హైదరాబాద్ లో…!

Arya-and-Sayyeshaa

ఈనెల 10న తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ హైదరాబాదులో వైభవంగా వివాహం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 14న తమ వివాహంపై ఈ జంట అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి తొమ్మిదో తేదీ సాయంత్రం సంగీత్ కార్యక్రమంతో మొదలుకానున్న ఈ పెళ్లి వేడుకలో మరుసటి రోజు నిక్కా జరుగనుంది. ఆర్య, సాయేషాల వివాహ వేడుకకు సినీ ప్రముఖులు భారీగా తరలివస్తారు. హైదరాబాదులో వివాహం అనంతరం చెన్నైలో రిసెప్షన్ వుంటుందని సమాచారం. సాయేషా ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తోంది. పెళ్లికి తర్వాత కూడా సాయేషా సినిమాల్లో నటించనుందని తెలుస్తోంది. సాయేషా, ఆర్యలు లవ్ మ్యారేజ్ చేసుకోవట్లేదని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని సాయేషా తల్లి షహీన్ స్పష్టం చేశారు. ఆర్య తమ ఇంటి అల్లుడు కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆర్య, సాయేషాల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లుగా అంతకుముందు కోలీవుడ్ మీడియా వార్తలై వచ్చాయి.

Related posts