telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

లాక్‌డౌన్‌ నుంచి ఎలాంటి సడలింపులు లేవు: కేజ్రీవాల్

arvind-kejriwal

కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీని సురక్షిత ప్రాంతంగా ఉంచడమే తమ లక్ష్యమని అందుకోసమే పని చేస్తామని చెప్పారు. అందుకోసం తాము లాక్‌డౌన్‌ నుంచి ఎలాంటి సడలింపులు ఇవ్వట్లేదని తెలిపారు. , దేశంలోని కరోనా వైరస్ బాధితుల్లో 12 శాతం మంది ఢిల్లీలోనే ఉన్నారని తెలిపారు.

ఈ విషయంపై తాము వారం రోజుల తర్వాత కరోనా పరిస్థితిని సమీక్షించి తమ తదుపరి నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రజలంతా సామాజిక దూరం నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. ‘కేంద్ర ప్రభుత్వం మార్గ దర్శకాల ప్రకారం ఏప్రిల్‌ 20 నుంచి దేశ వ్యాప్తంగా రెడ్‌జోన్లుగా ప్రకటించని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వస్తాయి. అంతేగానీ కట్టడి ప్రాంతాల్లో మాత్రం సడలింపులు ఉండవని స్పష్టం చేశారు.

Related posts