telugu navyamedia
రాజకీయ వార్తలు

సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం..ఢిల్లీ సరిహద్దు మూసివేత!

kejriwal on his campaign in ap

సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణతో నిన్న ఢిల్లీలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హింసను అణచివేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బయటి నుంచి విద్రోహ శక్తులు దేశ రాజధానిలోకి వచ్చి హింసకు పాల్పడుతున్నాయని గుర్తించిన సీఏం, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను కొంతకాలం మూసివేయాలని భావిస్తున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పారు.

అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం అదనపు బలగాలను మోహరించనుందని తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు హింసను అడ్డుకోలేకపోయారని సీఎం చెప్పారు. ఈ మేరకు తనకు నివేదిక వచ్చిందని చెప్పారు. పై నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళనకారులపైకి బాష్పవాయువు ప్రయోగించాలో, లాఠీచార్చి చేయాలో పోలీసులు తేల్చుకోలేకపోయారని చెప్పారు. ఇదే విషయాన్ని తాను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని అరవింద్ తెలిపారు.

Related posts