telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అరుణాచలేస్వరుని బ్రహ్మోత్సవాలు .. నేడు మహాదీపోత్సవం..

arunachaleswara brahmostav mahadweepam

తిరువణ్ణామలై లోని అరుణాచ లేశ్వరుని కార్తీక దీపోత్సవాల్లో భాగంగా 2,668 అడు గుల ఎత్తున్న కొండపై నేడు మహా దీపం వెలిగించే కార్యక్రమం జరుగనుంది. ప్రపంచ ప్రసిద్ధిచెందిన తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవ వేడుకలు ఈ నెల 1వ తేది ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు అరుణాచల్వేరుడు, ఉన్నామలై అమ్మన్‌ సహా పంచ మూర్తులు వివిధ వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు తమ పిల్లలను చెరుకుగడ లతో కూడిన ఉయ్యాలలో ఉంచి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం వేకువ జామున 4 గంటలకు ఆలయంలో భరణి దీపం, సా యంత్రం 6 గంటలకు కొండపై మహా దీపాన్ని వెలి గించనున్నారు. మహా దీపం వెలిగించేందుకు వినియో గించేందుకు శుభ్రమైన రాగితో చేసిన కొప్పెరకు సోమవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం కూలీలు కొప్పెరను మోసుకొని కొండ శిఖరానికి వెళ్లారు. అలాగే, మహా దీపం వెలిగించేందుకు వినియోగించే 1,000 మీటర్ల వత్తిని ఆలయ 3వ ప్రాకారంలో ఉన్న సంబంధ వినాయకుడి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడు కల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో ఇప్పటికే తిరువ ణ్ణామలై కిటకిటలాడుతోంది. ఈ వేడుకల్లో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. దీపం వెలిగించే అవసరమైన నెయ్యిని కానుకగా అందించేందుకు ఆలయ ప్రాంగణాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు.

తిరువణ్ణామలై పట్టణంలోని ప్రతి వీధి, ఆలయానికి వెళ్లే మార్గాలు భక్తులతో నిండిపోయాయి. ఈ వేడు కలను పురస్కరించుకొని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక బస్సులను నడుపుతుండగా, దక్షిణ రైల్వే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తిరువణ్ణామలైలో ఆగే ఏర్పాట్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ, జిల్లా యంత్రాంగం అన్ని వసతులు సమకూర్చగా, అవాంఛనీయ సంఘ టనలు జరుగకుండా 3 వేల పోలీసులతో బందోబస్తు పనులు చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి పంచ మూర్తులు అశ్వ వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత పంచమూర్తులను తిరు కళ్యాణ మండపానికి తరలించి ప్రత్యేక పూజల అనం తరం విశేష అలంకరణలు చేసి మహా దీపారాధనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు విద్యు దీపాలతో అలంకరించిన అశ్వ వాహనాల్లో మాఢ వీధుల్లో ఊరేగారు. భక్తులు కర్పూరహారతులిస్తూ పంచమూర్తులను ఆహ్వానించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కళాకారుల నృత్యాల మధ్య ఊరేగింపు సాగింది. ఈ వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకొని పునీతులయ్యారు.

Related posts