telugu navyamedia
సినిమా వార్తలు

విశాల్ నిజ స్వరూపం తెలిసింది… సీనియర్ హీరో ఫైర్

Arun Pandian fires on Vishal

కోలీవుడ్ నటుడు విశాల్ పై సీనియర్ నటుడు అరుణ్ పాండియన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. శక్తి శివన్ హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తోన్న చిత్రం “దౌలత్”. ఎంబీ మహ్మద్ అలీ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మాత, నటుడు అరుణ్ పాండియన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” పెద్ద హీరోలు నటించిన చిత్రాలపై మాత్రమే ప్రేక్షకుల దృష్టి పడే పరిస్థితి ఏర్పడుతోంది. మంచి కథ, నాణ్యతతో వస్తోన్న చిన్న సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందకుండా థియేటర్ల నుండి వెళ్లిపోతున్నాయి” అన్నారు. ఆ తరువాత విశాల్ గురించి మాట్లాడుతూ “విశాల్ నిజస్వరూపం ఇప్పుడే అర్ధమైంది. ఎందుకంటే ఆయన నటించిన ‘అయోగ్య’ సినిమా నిర్మాత నా మిత్రుడు. అతనికి ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో నాకు తెలుసు. ముందు మనం నిజాయితీగా ఉండాలి. ఆ తర్వాతే పదవులలోకి రావాలి. నిర్మాతను దక్కించుకోవడం ముఖ్యం కాదు.. నిర్మాతను కాపాడుకోవడమే ముఖ్యం” అంటూ చెప్పుకొచ్చారు.

Related posts