telugu navyamedia
రాజకీయ వార్తలు

అప్పట్లో ఆయన కేబినెట్‌ మంత్రి.. ఆర్టికల్ 370ని రూపొందించారు!

Gopalaswamy Ayyangar chennai

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం చరిత్రాత్మకమైన సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక సందేహాలు వెలువడుతున్నాయి. ఒకే దేశం ఒకే రాజ్యాంగంలో ఈ ఆర్టికల్‌ 370ని ఎందుకు రూపొందించారు. ఎవరి హయాంలో దీన్ని అమలు చేశారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బారత మాజీ ప్రధాని నెహ్రూ సమయంలో వివాదాస్పదమైన ఆర్టికల్ 370 ను తమిళనాడుకు చెందిన గోపాలస్వామి అయ్యంగార్ అప్పట్లో దీనిని రూపొందించారు. ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తంజావూరుకు చెందిన అప్పటి ఐ.ఏ.ఎస్ అధికారి. 1905 లో మద్రాసు సివిల్ సర్వీస్ అధికారిగా విధుల్లో చేరి, 1919 వరకు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత వృత్తిరీత్యా వివిధ ప్రదేశాల్లో పని చేశారు.

1937 నుంచి 1943 వరకు జమ్మూకశ్మీర్ ప్రధానిగా నియమింపబడ్డారు. తర్వాత 1943 నుంచి 47 వరకు మంత్రిగా పనిచేశారు. తర్వాత 1947 నుంచి 48 వరకు ఆనాటి ప్రధాని నెహ్రూ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి నియమింపబడ్డ ఏడుగురు సభ్యుల బృందంలో ఈయనొకరు. తర్వాత జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రూపొందించారు.

Related posts