telugu navyamedia
culture Sexual Problems trending

ఇలాగైతే దాంపత్య సుఖం మెరుగవుతుంది

Sexual problems with wound pain

నాకు 22 ఏళ్లు. మూడు నెలల క్రితం నాకు పెళ్లయ్యింది. అమ్మానాన్న చూసిన వ్యక్తినే పెళ్లాడాను. కానీ ఆయన పట్ల నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు అన్యోన్యంగానే ఉంటాం. ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మాత్రం మా మధ్య అంత ఎఫెక్షన్ కనిపించడం లేదు. తనను ప్రేమించడం ఎలా మొదలుపెట్టాలి?

ప్రేమించి పెళ్లాడితేనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుందని, పెద్దలు కుదిర్చిన వివాహంలో దంపతుల మధ్య ఎఫెక్షన్ ఉండదని చాలా మంది భావిస్తుంటారు. అరేంజ్డ్ మ్యారేజ్‌ చేసుకున్న వారిలో ఒకరి గురించి మరొకరి ముందుగా తెలిసే అవకాశాలు తక్కువ. దీంతో తనను ఎలా చూసుకోవాలి? ఎదుటి వ్యక్తికి ఏమంటే ఇష్టం, తను ఎలాంటి వ్యక్తి అనేది తేలడానికి కాస్త సమయం పడుతుంది. మీకు వివాహమై మూడు నెలలైందంటున్నారు. తను మంచోడని చెబుతున్నారు. మీ ఆయనతో ఎక్కువ సమయం గడపండి. తనను మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తరచుగా కలిసి బయటకు వెళ్తుండండి. కలిసి స్నానం చేయడం, వంట చేయడంలో తన సాయం తీసుకోవడం, ఒకరికొకరు బాడీ మసాజ్ చేయడం లాంటివి చేస్తే మీలో ఫీలింగ్స్ పెరుగుతాయి. ఒకరిపై మరొకరికి ఇష్టం మరింత పెరుగుతుంది.

Related posts

నర్సింగ్ చేసి సౌదీకి… ఏడాదిగా షేక్ ల చెరలో యువతి నరకయాతన

vimala p

ఐటీడీఏలో ఉద్యోగ అవకాశాలు

vimala p

“వెంకీ మామ” టీజర్ వచ్చేసింది… నాగ చైతన్య పుట్టినరోజు గిఫ్ట్

vimala p