telugu navyamedia
telugu cinema news trending

రాజకీయాలంటే అసహ్యం… సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ నట దిగ్గజం వ్యాఖ్యలు

Arnold

హాలీవుడ్ దిగ్గజ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2003 నుంచి 2011 వరకు గవర్నర్‌గా పనిచేసిన ఆయన రాజకీయాలంటే తనకు అసహ్యమంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాను గవర్నర్‌గా పనిచేసినప్పటికీ తనకు తాను ఎప్పుడూ రాజకీయ నేతగా భావించుకోలేదన్నారు. “నేను గవర్నర్‌గా పనిచేసినప్పటికీ నన్ను నేను ఎప్పుడూ రాజకీయ నేతగా అనుకోలేదు. ఓ ప్రజా సేవకుడిలానే ఉన్నాను. ప్రజల జీవనాన్ని మరింత మెరుగు పరిచేందుకు అవసరమైన విధానాలు రూపొందించాను” అని ష్వార్జ్‌నెగ్గర్ స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే తలపుతోనే రాజకీయాల్లో అడుగుపెట్టినట్టు ఆర్నాల్డ్ చెప్పుకొచ్చారు. తనది ఆస్ట్రియన్ బ్యాక్‌గ్రౌండ్ కావడంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. కాగా, 72 ఏళ్ల ఆర్నాల్డ్ ప్రస్తుతం తన రాబోయే సినిమా ‘టర్మినేటర్: డార్క్‌ ఫేట్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. నవంబరు 1న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Related posts

ఓటిటిలో రిలీజవుతున్న తొలి తెలుగు చిత్రం ‘‘అమృతరామమ్’’..

vimala p

బాలీవుడ్ నటి ప్రియాంక .. మైనం విగ్రహాలు..

vimala p

బోనీ కపూర్ వద్ద పనిచేసే యువకుడికి కరోనా!

vimala p