telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనా చొరబాటుపై .. ఆర్మీ స్పష్టత..

army chief ravath checking in LOC

ఒకపక్క పాక్ తో మరో పక్క చైనా తో భారత్ కు మొదటి నుండి అనవసరపు గొడవలు తప్పడంలేదు. ఇన్నాళ్ళకి పాక్ కు చెక్ పెట్టె నిర్ణయం భారతప్రభుత్వం తీసుకుంది. అంతవరకు బాగానే ఉందనుకోగానే, చైనా పై బీజేపీ నేత అన్న మాటలు మరోసారి పాక్-చైనా స్నేహబంధాన్ని గట్టిగా గుర్తుచేశాయి. బీజేపీ నేత ఆరుణచల్ రాష్ట్ర అధ్యక్షుడు,లోక్‌సభ సభ్యుడు అయిన తాపిర్ గావ్ భారత భూబాగంలోకి చైనా చొచ్చుకుని వచ్చిందంటూ వెల్లడించారు, దీనిని ఇండియన్ ఆర్మి కొట్టిపారేసింది. అలాంటీ చొరబాట్లు జరగలేదని ఆర్మీ అధికారికంగా ప్రకటించింది.ఇలాంటీ సంఘటనలు ఆర్మీ గుర్తించలేదని అన్నారు. భారత్, చైనా, మయన్మార్ సరిహద్దు ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖను దాటుకుని సుమారు వంద కిలోమీటర్లు పరిధిలో ఉన్న అన్ధాన్ జిల్లాలోని ఛగ్లగామ్ సమీపంలో అడవుల మధ్య గల డోయిమ్రు నదిపై చైనా సైనిక బలగాలు ఈ వంతెనను నిర్మించినట్టు తాపిర్ వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన కొన్ని వీడీయోలు, ఫోటోలు సైతం మీడీయాకు విడుదల చేశాడు.  దీంతో పలు మీడీయో కథనాలు కూడ వెలువడ్డాయి. దీంతో అలర్ట్ అయిన సైన్యం దీనిపై విచారణ చేపట్టింది. చైనా భారత భూ భాగంలోకి చొచ్చుకు రాలేదని తెలిపింది. ఎంపీ తెలిపి తెలిపిన బ్రిడ్జి నిర్మాణం కూడ ఎక్కడ కనగోనబడలేదని సైన్యం తెలిపింది. దట్టమైన అడవుల ప్రాంతంలో నదుల వెంట వృక్ష సంపద ఉండడంతో పాటు నీటీ ప్రవాహాల వెంట పలువురు తిరుగుతారని అలాంటీ సంధర్భంలో ప్రజలు వంతనేలు నిర్మించి ఉండవచ్చని ఆర్మీ అధికారులు తెలిపారు.

Related posts