Trending Today వార్తలు సామాజిక సినిమా వార్తలు

వై.ఎస్.రాజశేఖరరెడ్డి బయోపిక్ లో…వై.ఎస్.జగన్ గా అర్జున్ రెడ్డి…

arjunreddy famous actor in yatra movie

బయోపిక్ ల యుగంలో తెలుగు సినీ, రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో ఆయా పాత్రలను ఇంకా ఒక్కోక్కటిగానే విడుదల చేస్తున్నారు.

అదే దారిన దివంగత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కూడా యాత్ర పేరుమీద తెరకెక్కిస్తున్నారు. ఇందులో కూడా పాత్రలను ఆచితూచి ఎంచుకుంటున్నారు దర్శకుడు. తాజాగా వై.ఎస్.జగన్ పాత్రకు కూడా చాలా మందినే అనుకున్నప్పటికీ అర్జున్ రెడ్డి ఫేమస్ విజయ్ దేవరకొండ ను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవల తన చిత్ర విజయంతో ఉత్సాహంగా ఉన్న విజయ్ అయితే జగన్ పాత్రలో బాగా మెప్పిస్తాడని దర్శకుడు అతడిని ఎంపిక చేసుకున్నాడట. ఈ పాత్రకోసం ముందు సూర్య, కార్తిలను అనుకున్నా కూడా విజయ్ పై ఎక్కువగా దర్శకుడు మొగ్గుచూపినట్టు తెలుస్తుంది. కాగా యాత్ర చిత్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాత్రలో ముమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

తెరాస సభ కోసం…రంగు మార్చుకున్న నగరం…

chandra sekkhar

మంచులక్ష్మీపై మాధవీలత కామెంట్స్

jithu j

ఇలా కూడా కాపీ కొట్టొచ్చా… వీడియో వైరల్….

admin

Leave a Comment