telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ స్టార్ తో.. దర్శకుడు సందీప్ రెడ్డి..

arjunreddy director with salman khan

‘అర్జున్ రెడ్డి’ చిత్రం ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా ఘనవిజయం దక్కించుకున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు అక్కడి నిర్మాతలంతా సందీప్ రెడ్డి వంగా గురించే చర్చించుకుంటున్నారు. ఆయన తో చిత్రాలను తీయాలని ఉత్సాహం చూపుతున్నారట.

బాలీవుడ్ లోనే బడా నిర్మాతలు సందీప్ తో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నారట.. టి – సిరీస్ వారు ఆయనతో ఓ భారీ సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా చేయనున్నాడని కూడా అంటున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా మరో స్థాయికి వెళ్ళినట్టే!!

Related posts